ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ.. రోజులు లెక్కపెట్టుకో: సీఎం - amit shah

రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దిల్లీలో కేజ్రీవాల్ ధర్నాకు సీఎం మద్దతు తెలిపారు.

దిల్లీలో కేజ్రీవాల్ ధర్నాలో మాట్లాడుతున్న చంద్రబాబు

By

Published : Feb 13, 2019, 6:58 PM IST

దిల్లీలో కేజ్రీవాల్ ధర్నాలో మాట్లాడుతున్న చంద్రబాబు
ప్రధాని మోదీ అప్రజాస్వామిక పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకే జాతీయ స్థాయిలో విపక్షాలు ఏకమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భాజపా పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయామన్నారు. విపక్ష నేతల చరవాణులను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. అందరు విపక్ష నేతలపైనా ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని... భాజపా నాయకులపై మాత్రం ఒక్క దాడి జరగలేదని గుర్తుచేశారు.

కేజ్రీవాల్‌ తన పరిపాలనతో దిల్లీలో అద్భుతాలు చేశారని చంద్రబాబు ప్రశంసించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన దీక్షకు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా అని ప్రశ్నించారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేకే ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేశారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. 1972 తర్వాత దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవని ధ్వజమెత్తారు.

మోదీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని నేతలను కోరారు. మోదీ, అమిత్‌షా వైఖరిని ఖండించారు. ఎక్కడ, ఎవరికి ఇబ్బంది వచ్చినా అంతా కలిసి ఆందోళన చేశామని గుర్తుచేశారు. దేశం, ప్రజాస్వామ్య రక్షణకు ప్రజలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలని... త్వరలోనే కుర్చీ దిగుతారని జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details