ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోదా ఇస్తామని మోసం చేశారు: చంద్రబాబు - BABU PROTEST IN DELHI

భాజపా పాలనలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరగబడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పెట్టారని... జమ్మూకశ్మీర్‌ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించారని ఆరోపించారు.

దిల్లీ ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు

By

Published : Feb 11, 2019, 6:44 PM IST

దిల్లీ ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు
హోదా ఇస్తామని చెప్పి ఇన్నాళ్లూ మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపాపై ధ్వజమెత్తారు. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రధాని ఆనంద పడుతున్నారన్న చంద్రబాబు...రాష్ట్ర హక్కుల సాధనకు పట్టుదలతో పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. మోదీకి కుటుంబం ఉంటే దాని విలువ తెలిసేదని చంద్రబాబు విమర్శించారు. వ్యక్తిగత దాడి మొదలుపెడితే మోదీ ఎక్కడ ముఖం పెట్టుకుంటారని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా కలిసి స్వతంత్ర వ్యవస్థలను నాశనం చేస్తున్నారని అన్నారు. పలు పార్టీల నేతలు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details