ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' పింఛన్ దెయ్యాలు వదిలిపోయాయి' - CONGRESS

ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, చర్మకారులు, డప్పు కళాకారులకూ పింఛన్లు ఇస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని చంద్రబాబు ఉద్ఘాటించారు.

గతంలో దెయ్యాలూ పింఛన్లు తీసుకునేవి: చంద్రబాబు

By

Published : Feb 2, 2019, 2:39 PM IST

Updated : Feb 4, 2019, 5:31 PM IST

మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేకుండా మహిళలకు రూ.10వేలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఉచితంగా ఇస్తున్న సొమ్మును రుణం అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 94 లక్షల మందికి పసుపు-కుంకుమ కింద ఆర్థికసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రెట్టింపు చేసిన పింఛన్లు 54 లక్షల మందికి ఇస్తున్నామన్న చంద్రబాబు... ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, చర్మకారులు, డప్పు కళాకారులకూ పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నామన్న సీఎం...దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల్లో అవినీతిని నిర్మూలించామన్న చంద్రబాబు..రూ.83 వేల కోట్ల ఖర్చుతో 23 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాని వివరించారు. అన్నదాతలకు అండగా ఉంటున్నామన్న చంద్రబాబు.. మోదీ ప్రకటించిన సాయం ముష్టి వేసినట్లుగా ఉందని ఝ్వజమెత్తారు. 5 ఎకరాలున్న రైతులకు ముష్టి వేసినట్లుగా రూ.2వేలు ఇస్తే ఏం లాభమని ప్రశ్నించారు.

గతంలో దెయ్యాలూ పింఛన్లు తీసుకునేవి: చంద్రబాబు

Last Updated : Feb 4, 2019, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details