కేజ్రీవాల్‌పై దాడితో.. 'వారి ఓటమి' ఖాయమైపోయింది! - chandrababu condemn the attack
దిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం కేజ్రీవాల్‌పై జరిగిన దాడిని.. సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. దిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
babu
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై జరిగిన దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకున్నావారే.. ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించాలనుకున్నవారే.. ఎన్నికల్లో ఓడిపోతామని భయపడినవారే ఈ పని చేశారని ట్విటర్లో మండిపడ్డారు. ఇలాంటి భౌతిక దాడులతో.. తమ ఓటమిని వారే అంగీరకించినట్టయిందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పోలీసులు దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. దాడి వెనక వాస్తవాలు బయటపడాలన్నారు.