ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందుల పంచాయితీలు అమరావతిలో కుదరవు: చంద్రబాబు - Pulivendula

పులివెందుల తరహా పంచాయితీలతో ప్రభుత్వ పాలన సాగించలేరని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ముడుపుల కోసమే వైకాపా నేతలు రివ్యూల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక విజయవాడలో విమానాలు తగ్గిపోయి... మళ్లీ హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ధ్వజమెత్తారు. పీపీఏలపై సమీక్షతో కంపెనీలన్నీ వెనుకంజ వేస్తాయని... తాజాగా ఫిచ్‌ సంస్థ హెచ్చరించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

By

Published : Jul 18, 2019, 5:19 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

సీఎం జగన్‌... అమరావతిలో పులివెందుల పంచాయితీలు చేయాలనుకుంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలకు పాల్పడ్డం పులివెందులలో కుదురుతాయేమో గానీ... అమరావతిలో కుదరవని పేర్కొన్నారు. గురువారం చంద్రబాబు అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై ముచ్చటించారు. అసెంబ్లీ తీరుపై స్పందిస్తూ... వైకాపా సభ్యులు సభలో అవలంభిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు.

రాజధాని పరిధిలో దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన భూమి ఉందన్న చంద్రబాబు... గతంలో బాగా పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పరిధిలో అన్ని రంగాలు పతనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూలీలకు పని దొరకడం లేదన్నారు. కమీషన్ల కోసమే విద్యుత్‌ కంపెనీలను బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలని సూచించారు.

పీపీఏలపై సమీక్షతో కంపెనీలన్నీ వెనుకంజ వేస్తాయని తాజాగా ఫిచ్‌ సంస్థ హెచ్చరించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఫిచ్‌ రేటింగ్స్ సంస్థల హెచ్చరికలు పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. గత 5ఏళ్లలో విద్యుత్ శాఖకు 132 అవార్డులు వచ్చాయన్న తెదేపా అధినేత... పీపీఏలపై సమీక్ష పేరుతో కంపెనీలను బెదిరించడం తగదని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక గన్నవరానికి విమానాలు తగ్గిపోయాయని... చాలా విమానాలు రద్దు చేశారని గుర్తుచేశారు.

ఇక నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా... మళ్ళీ హైదరాబాద్​కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా తెలంగాణకు జగన్‌ ఈ విధంగా ఆదాయం సమకూరుస్తున్నారని ఆరోపించారు. తాను అద్దెకుంటున్న నివాసం నదీ పరివాహకం కిందకు రాదని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ఉండటం వల్ల పాయ చీలి నీరు వెనక్కివచ్చి తానుంటున్న ఇంటివైపునకు ప్రవహిస్తోందని చంద్రబాబు వివరించారు.

ఇదీ చదవండీ...స్మగ్లర్లకు చిక్కిన నత్తగుల్ల.. సరిహద్దులు దాటుతోందిలా..!

ABOUT THE AUTHOR

...view details