కాపుల రిజర్వేషన్‌పై మీ వైఖరి ఏంటీ?:చంద్రబాబు - assembly
అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ అంశం తీవ్ర దుమారం రేపింది. అధికార పక్ష సభ్యుల విమర్శలు తిప్పికొట్టిన చంద్రబాబు... తాము కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారో లేదో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేయాలని ప్రతిపక్ష నేత.... సీఎంను నిలదీశారు.
chandrababu_about_kapu_reservations
కాపు రిజర్వేషన్లపై సమావేశాల్లో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడారు. 'సభ నాయకుడు లేచినప్పుడు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడూ అవకాశం ఇవ్వాలి. రిజర్వేషన్ల కోసం కాపులు అనేక దఫాలుగా పోరాడుతున్నారు. కాపు రిజర్వేషన్లపై నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పాలికదా?. పది శాతం రిజర్వేషన్లు ఓసీలకు తీసుకొస్తే 5 శాతం కాపులకు ఇవ్వాలని బిల్లు చేశాం. అసలు మీ వైఖరి ఎంటీ?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
Last Updated : Jul 16, 2019, 3:54 PM IST