ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యాపారవేత్తగా ఎక్కువకు అమ్ముకుంటారు... సీఎంగా బురద చల్లుతారా '

పీపీఏలపై వైకాపా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్​ ఒప్పందాలపై వేసిన కమిటీ తప్పుడు లెక్కలు వేస్తుందన్నారు. కర్ణాటకలో విద్యుత్​ డెవలపర్‌గా ఉన్న జగన్​ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని... రాష్ట్రంలో మాత్రం తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Jul 19, 2019, 1:59 PM IST

Updated : Jul 19, 2019, 2:48 PM IST

విద్యుత్​ ఒప్పందాలపై చర్చలో మాట్లాడుతున్న చంద్రబాబు

విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. విద్యుత్​ ఒప్పందాల ప్రభుత్వం వేసిన కమిటీ తప్పుడు లెక్కలు చూపిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్​ సంస్కరణలతో రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ దిశగా నడిపించామని తెలిపారు. 22.5 మిలియన్​ యూనిట్ల కొరత ఉంటే లేకుండా చేశామన్నారు. ఇప్పుడు కోతలు మొదలయ్యాయన్నారు. వైకాపా తప్పుడు సంకేతాలతో ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు.

కర్ణాటకలో విద్యుత్​ డెవలపర్‌గా ఉన్న జగన్‌... ఎక్కువ ధరకు విద్యుత్​ అమ్ముతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడ మాత్రం అంత ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తున్నారని.... దీనిపై ఆయనే ఆలోచించుకోవాలన్నారు. పవన, సౌర విద్యుత్‌ ధరలు తగ్గించాలని కోరామని కావాలంటే దస్త్రాలు చూసుకోవచ్చన్నారు.

విద్యుత్​ ఒప్పందాలపై చర్చలో మాట్లాడుతున్న చంద్రబాబు
Last Updated : Jul 19, 2019, 2:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details