ఈ నెల 23 తర్వాత దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పుతారని ఆ పార్టీ శాసనమండలి సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.... ప్రధాని మోదీ ఓటమి భయంతోనే చంద్రబాబుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు వ్యవస్థలపై పోరాడుతున్నారే తప్ప.. వ్యక్తులపై కాదన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీ ప్యాట్ల వ్యవస్థను తీసుకువచ్చిన ఎన్నికల సంఘం... వాటిని లెక్కించడానికి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జగన్ చేసిన లక్ష కోట్ల అవినీతిని ప్రజలు మర్చిపోలేదని... ఓడిపోతామని తెలిసే ఎన్నికలు పూర్తై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆంధ్ర గడ్డపై కాలుపెట్టలేదని విమర్శించారు. ఓ వైపు ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడుతుంటే జగన్ లోటస్పాండ్లో కూర్చుని సేద తీరుతున్నారని విమర్శించారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారు: వైవీబీ - rajendra prasad
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ఓటమి భయంతోనే ఆంధ్రలో కాలు మోపడం లేదని విమర్శించారు.
రాజేంద్రప్రసాద్