ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక్కరోజే 5 లక్షల ఫారం-6 దరఖాస్తులు' - ceo

ఈ ఏడాది ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది. నిన్న ఒక్కరోజే 5 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చాయి. నవంబర్ 1 తర్వాత 37.28 లక్షల ఫారం-6 దరఖాస్తులు రాగా.... పత్రాలు సరిగా లేని 3 లక్షల దరఖాస్తులును తిరస్కరించాం- గోపాల కృష్ణ ద్వివేది

ఫారం- 6 దరఖాస్తులు

By

Published : Mar 16, 2019, 8:18 PM IST

సచివాలయంలో ద్వివేది మీడియా సమావేశం
రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంచనా వేశారు. నిన్న ఒక్క రోజే 5 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. జనవరి 11 నాటికి 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు ఉండగా... కొత్త వాటితో కలిపి 4 కోట్ల ఓటర్లకు చేరుతామని వెల్లడించారు. ఈ నెల 25 నాటికి తుది జాబితా రూపొందిస్తామని...31లోగా కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details