15న మళ్లీ కలవండి: తెదేపాకు సీఈసీ లేఖ - central election commission
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలో తలెత్తిన సమస్యలపై.. తెదేపా వెలిబుచ్చిన అభ్యంతరాల మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తమను 15న మరోసారి కలవొచ్చని చెబుతూ తెదేపాకు లేఖ పంపింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పిన అభ్యంతరాలపై.. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ల మొరాయింపు విషయమై.. తెదేపాకు లేఖ రాసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు మరోసారి తమను కలవొచ్చని చెప్పింది. అయితే.. తెదేపా తరఫున సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్‌ను పంపడంపై అభ్యంతరం వెలిబుచ్చింది. ఇతర సాంకేతిక నిపుణులతో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ లేఖను తెదేపా న్యాయ విభాగం అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు పంపించింది.