బొండా ఉమా కుటుంబంపై కేసు నమోదు - తెదేపా
తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అతని ఇద్దరి కుమారులపై అజిత్సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రచారంలో ఎదురపడ్డ బోండా... తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నేత కోగంటి సత్యం ఫిర్యాదు చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమాపై కేసు నమోదు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అతని ఇద్దరి కుమారులపై అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈనెల 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురుపడ్డ ఉమా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోగంటి సత్యం ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు...ఉమాతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.
Last Updated : Apr 16, 2019, 5:10 PM IST