ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు కోసం మా ఇళ్లు ఇస్తాం.. రైతులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతికి దూరం చేయాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాజధాని ప్రాంత రైతులు అన్నారు. ఆయన్న రాజధానికి దూరం చేయడానికే నివాసం అక్రమమంటూ నోటీసులిచ్చారని ఆరోపించారు. మా ఇంట్లో చోటిస్తామంటూ.. చంద్రబాబు నివాసం వద్దకు రైతులు తరలివచ్చారు.

By

Published : Jun 28, 2019, 5:42 PM IST

చంద్రబాబు రాజధానిలోనే ఉండాలి

చంద్రబాబు కోసం మా ఇళ్లు ఇస్తాం.. రైతులు

రాజధానిలో రాజకీయం వేడెక్కుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లు అక్రమ కట్టడం అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని తాఖీదులు గోడకు అంటించింది. రాష్ట్ర ప్రభుత్వానిది దుందుడుకు చర్య అంటూ తెదేపా మండిపడింది. దురుద్దేశపూర్వకంగానే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తోంది.

బాబు మాతోనే ఉండాలి..
ఇవాళ ఉదయం సీఆర్డీఏ నోటీసులు ఇవ్వగా.. మధ్యాహ్నానికి రాజధాని రైతులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. వెలగపూడి, తుళ్లూరు గ్రామాల నుంచి వచ్చిన రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబును రాజధాని ప్రాంతం నుంచి బయటకు పంపించి వేయాలన్న దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. బాబు తమతోనే ఉండాలని కోరారు. అవసరమైతే.. తమ స్థలాన్ని చంద్రబాబుకు ఇస్తామని.. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లల్లో అయినా చోటిస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే.. అమరావతిని అభివృద్ధి చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఇవీ చదవండి...చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details