అమరావతిలోనూ బసవతారకం - కేన్సర్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 1000 పడకల సామర్థ్యంతో 300 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మించనున్నారు.
![అమరావతిలోనూ బసవతారకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2444748-635-9526b67f-1d05-4fbd-a97e-f47b3306f12e.jpg)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆంధ్రప్రదేశ్ లోనూ.. సేవలందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది. 1000 పడకల సామర్థ్యంతో 300 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మిస్తున్నామని బసవతారకం కూమారుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. పూజ కార్యక్రమంలో శాసససభాపతి కోడెల శివప్రసాద్ , మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబులు పాల్గొన్నారు.