వ్యాపారి రాంప్రసాద్ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతోపాటు మరో నలుగురిని ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రాంప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్లు కలిసి వ్యాపారం చేశారని తమ విచారణలో వెల్లడైందన్నారు. వ్యాపారంలో భాగంగా కోగంటి సత్యానికి రాంప్రసాద్ రూ.70 కోట్లు బకాయిపడ్డాడు. ఇరువురు కలిసి దానిని రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేసుకున్నారు. అప్పు చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని డీసీపీ తెలిపారు.
'ఆర్థికపరమైన అంశాలే రాంప్రసాద్ హత్యకు కారణం'
వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు వివరాలను హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలే ఈ హత్యకు ప్రధాన కారణామని తెలిపారు.
విజయవాడలో ఉన్నప్పుడు కోగంటి సత్యం, ఆయన మిత్రులపై రాంప్రసాద్ కేసులు పెట్టారు. కోగంటి సత్యంతో ఉన్న విభేదాల వల్లే రాంప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్‌కు తరలి వచ్చాడని తెలిపారు. డబ్బులు, కేసుల వల్ల రాంప్రసాద్‌పై కక్ష్య పెంచుకన్న సత్యం... శ్యామ్‌తో కలిసి రాంప్రసాద్ హత్యకు పథకం పన్నాడు. కేసు తనపై రాకుండా రాంప్రసాద్‌ను హత్య చేయించాలని భావించిన సత్యం.. ముగ్గురితో రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు డీసీపీ. నిందితులు సుమారు నెలరోజులపాటు రెక్కి నిర్వహించినట్లు చెప్పారు. ఈ హత్య కేసులో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.