వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన విజ్ఞప్తి మేరకే కియా మోటార్స్ పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులే చెప్పారని తెలిపారు. ఈ అంశాలన్నీ పేర్కొంటూ సీఎం జగన్‌కు కియా ప్రతినిధులు లేఖ రాశారని బుగ్గన వెల్లడించారు.
చంద్రబాబు వెళ్లడం వల్లే పరిశ్రమలు వచ్చాయని గొప్పగా చెబుతున్నారని... కంప్యూటర్ వాళ్లే కనిపెట్టినట్లు తెదేపా ప్రభుత్వం చెప్పిందని ఆర్థికమంత్రి ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సీఎంలు విదేశీ పర్యటనలకు వెళ్లడం ఎప్పడూ వినలేదని...ఐటీ కోసం తిరిగామని తమిళనాడు ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదన్నారు.