ఎన్నికల సంఘం వైకాపా పక్షపాతిగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న అమరావతిలోఆరోపించారు. విజయసాయిరెడ్డి లాంటి ఆర్థిక నేరస్థులు ఫిర్యాదు చేస్తే ఈసీ వెంటనే స్పందించిందన్న విప్... తెదేపా ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలలో లోపాలపై జాతీయ స్థాయిలో అవగాహన కోసమే చంద్రబాబు పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు. ధర్మ పోరాటంలో భాగంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు మోదీ నియోజకవర్గం వారణాశికి వెళ్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలకు ప్రధాని మోదీ మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. అవినీతిపరులు, నేరస్థులను ప్రధాని మోదీ కాపాడుతున్నారని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.
ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: బుద్ధా వెంకన్న - ఈసీ
ఎన్నికల సంఘం వైఖరిపై ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయసాయి రెడ్డి లాంటి ఆర్థిక నేరస్థులు ఫిర్యాదు చేస్తే స్పందించినంత వేగంగా... తెదేపా పిర్యాదులకు ఈసీ స్పందించటం లేదని ఆరోపించారు.
ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న