ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అరెస్ట్ - బుద్ధా వెంకన్న అరెస్టు
తెదేపా అనుకూల ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడ మల్లిఖార్జునపేటలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళనకు దిగారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అరెస్ట్
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా అనుకూల మహిళ ఓటర్లను ఇబ్బందులకు గురి చేసేందుకే పని చేయని ఈవీఎంలను అమర్చారని ఆరోపిస్తూ విజయవాడలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటల నుంచి మహిళలు క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులుపడుతున్నారన్నారు. స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వచ్చిన మహిళలను అడ్డుకునేందుకే వైకాపా-భాజపా కలిసి చేస్తున్న కుట్ర అని అగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనను చేపట్టిన బుద్ధాను పోలీసులు అరెస్టు చేశారు.