నల్ల దుస్తులతో లోకేష్ నిరసన
చిత్తూరు జిల్లా రేణిగుంటలో పది ఎలక్ట్రానిక్స్ సంస్థలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు.
రూ.80 కోట్ల పెట్టుబడులు
ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ -1 లో కార్బన్ మొబైల్స్ సంస్థను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో రూ. 80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 1445 కోట్ల విలువైన కంపెనీలకు లోకేశ్ భూమి పూజ చేశారు. 7,088 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని స్పష్టం చేశారు. ఏసీలు, ఫ్రిజ్‌ల తయారీలో దిగ్గజ సంస్థ వోల్టాస్ సంస్థకు లోకేశ్ శంకుస్థాపన చేశారు.వోల్టాస్ సంస్థ 653 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థతో 1,680 మందికి ఉపాధి కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రెండో క్లస్టర్లో సీసీ కెమెరాలు, టీవీల తయారీ సంస్థ డిక్సన్ 145 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డిక్సన్ సంస్థతో 1131 మందికి ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.