'ప్రజావేదికను ఇతర అవసరాలకు వాడితే బాగుండు' - ప్రత్యేకహోదా
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను ఓ విధానంగా తీసుకుని తొలగిస్తే తమ పార్టీ ఎలాంటి అభ్యంతరం తెలపదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా తొలగించే చర్యలు మాత్రం సరికావని హితవు పలికారు.
bjp_state_president_comments_on_prajavedika
ప్రజా వేదిక కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజాదనం ఖర్చు చేశారని... నిర్మాణాన్ని కూల్చేయడం ఆ నిధులను కాలువలో పారబోయడమేనన్నారు. కూలగొట్టే బదులు ఆ ప్రాంగణాన్ని వేరే ఇతర అవసరాలకు ఉపయోగిస్తే మేలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయంగా తాము ఐదేళ్ల నుంచి చెబుతున్నా... తమ రాజకీయం కోసం పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. భాజపాలో చేరికలు కొనసాగుతాయని వెల్లడించారు.