రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వభూషణ్ హరిచందన్ ప్రముఖ న్యాయవాది. ఆయన ఒడిశా మాజీమంత్రిగా పని చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కొనసాగారు. గతంలో జనసంఘ్, జనతాపార్టీలో కొనసాగారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన హరిచందన్.. 1988లో జనతాపార్టీలో చేరారు. 1996లో తిరిగి భాజపాలో చేరారు. ఒడిశాలో సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా కొనసాగారు. భాజపా, బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. భాజపా సీనియర్ నేతగా పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. సంఘ్ కార్యకలాపాల్లోనూ కీలకంగా పని చేశారు.
ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ - undefined
రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
bishwabhushan_apponted_as_governer_to_andhrapradesh
బిశ్వభూషణ్ హరిచందన్ ఒడియాలో పలు గ్రంథాలు రచించారు. మారుబటాస్, రాణాప్రతాప్, శేషజలక్, అస్తశిఖ, మానసి గ్రంథాలను రచించారు.
Last Updated : Jul 16, 2019, 8:14 PM IST
TAGGED:
new_governer_appointed_to_ap