తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాప తీర్మానాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మండలిలో హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టనున్నారు. కాసేపు వాయిదా అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసన సభలో తెలంగాణ సీఎం ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెడతారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాన్ని కూడా ప్రభుత్వం ఉభయ సభల ముందు ఉంచనుంది.
రెండో శాసనసభ కొలువు తీరిన నేపథ్యంలో సభా వ్యవహారాల సలహా సంఘాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రకటిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శాసన సభ, మండలి బీఏసీలు సమావేశమవుతాయి. ఈ భేటీలో ఎజెండాను ఖరారు చేస్తారు.
రెండు బిల్లులకుఆమోదం