జగన్ పాలనపై బాలయ్య ఏమన్నాడంటే? - governor speech
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ఈ రోజు చేసిన ప్రసంగంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమైన విషయాలను ప్రస్తావించలేదని అన్నారు.

గవర్నర్ ప్రసంగంపై తెదేపా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. ప్రతిష్టాత్మక అమరావతి నిర్మాణం గురించి ప్రసంగంలో చెప్పలేదని, బీసీల సంక్షేమ ప్రస్తావన లేదని అన్నారు. విజయవాడలో తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలకు హాజరైన ఆయన మీడియాతో ముచ్చటించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేసింది తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 15 రోజుల జగన్ పాలనపై అభిప్రాయం కోరగా... మరికొంత కాలం చూద్దామని మీడియాకు బదులిచ్చారు. తెదేపా ఎమ్మెల్యేలు ప్రజలకు బంట్రోతులని వైకాపా వారిలా కాదని బాలయ్య వ్యాఖ్యానించారు..