రేపట్నుంచి సభాపర్వం...ఇవాళ బీఏసీ సమావేశం - BAC meeting today under assembly speaker
ఇవాళ ఉదయం 10.30 గంటలకు సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12వ తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచనున్నారు.

గత అసెంబ్లీ సమావేశాల కంటే భిన్నమైన మార్పులు ఉంటాయన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గటే నిర్ణయాలు తీసుకుంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సారీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించనున్నారు.
15 వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సెషన్ ప్రారంభానికి ఒకరోజు ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఏసీ సమావేశానికి ప్రభుత్వం తరపున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అధికార పార్టీ తరపున ప్రభుత్వ విప్లు, విపక్షం తరపున తెదేపా ప్రతినిధులు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.
శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12 తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.