పేగువ్యాధితో బాధపడుతున్న 8 నెలల పసిపాప పర్ణిక ... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాయం కోసం ఎదురుచూస్తోంది. విశాఖ జిల్లా గాజువాక పట్టణానికి చెందిన వీరు... వారం నుంచి సచివాలయానికి వస్తున్నారు. పసిపాపతో పడిగాపులుకాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కూతురికి చికిత్స చేయించడానికి సీఎం సహాయనిధి నుంచి సాయం కోరుతున్నారు. సీఎంను కలిసేందుకు అనుమతించాలని కన్నీటిపర్యంతమయ్యారు. సచివాలయం బస్టాపులో చిన్నారి సహా తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. సీఎం జగన్ స్పందించి చికిత్స చేయించాలని... తమ పాప ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.