ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీర్పును గౌరవిస్తాం... పోరాటం సాగిస్తాం: బాబు - elections commission

50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తాము వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిందన్న చంద్రబాబు... ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే తన కోరికని స్పష్టం చేశారు.

తీర్పును గౌరవిస్తాం... పోరాటం సాగిస్తాం: బాబు

By

Published : May 7, 2019, 12:16 PM IST

తీర్పును గౌరవిస్తాం... పోరాటం సాగిస్తాం: బాబు

తాము వేసిన రివ్యూ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని... ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేసిన చంద్రబాబు... వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై తామంతా ఒక్కటే కోరామన్నారు. ఎన్నికల నిర్వహణపై పారదర్శకత వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు.

ఈసీ తప్పించుకునేందుకే...
లెక్కింపు ఆలస్యమవుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడమేనన్న చంద్రబాబు... కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యమని ఈసీ గుర్తించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని... సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే పోరాటం కొనసాగిస్తామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తామన్న చంద్రబాబు... తమ పోరాటంతోనే ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు.

2009 నుంచి పోరాటం చేశాం...
వీవీ ప్యాట్‌లు పెట్టాలని 2009 నుంచి పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పోరాటం వల్ల వీవీ ప్యాట్‌లు వచ్చాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించడంలో ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటని ప్రశ్నించిన చంద్రబాబు... వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి కౌంటింగ్‌ సిబ్బంది సరిపోతారని అన్నారు. ప్రజాస్వామ్యంలోని అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details