దిల్లీ నుంచి బెంగళూరుకు.. అటు నుంచి కుప్పంకు! - kumaraswamy
దిల్లీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు.. బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు.. జాతీయ స్థాయిలో మంతనాలు కొనసాగించారు. భాజపాయేతర పక్షాల సమావేశంలో కీలకంగా వ్యవహరించిన సీఎం.. అనంతరం పలు పార్టీల నేతలతో ఈసీని కలిసి వీవీ ప్యాట్ల లెక్కింపుపై మాట్లాడారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. దిల్లీ పరిణామాలను వారి దృష్టికి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు... ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అక్కడి నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్న చంద్రబాబు.. గంగమ్మ జాతరకు హాజరవుతారు. సతీమణితో కలిసి.. అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించిన అనంతరం.. విజయవాడ చేరుకుంటారు.