తెదేపా అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రతిపక్షనేతకు తెదేపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుని జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కారు డోరు వద్ద నిలుచుని కార్యకర్తలకు అభివాదం చేసిన చంద్రబాబు.. అనంతరం అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
చంద్రబాబు కాన్వాయ్ ని వాహనాల్లో అనుసరించిన తెదేపా కార్యకర్తల్ని...పోలీసులు ఎనికేపాడు,రామవరప్పాడు రింగురోడ్డు వద్దే ఆపేశారు.చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేత నేపథ్యంలో వారిని వెళ్లనీయలేదు.కృష్ణా కరకట్ట మీదుగా చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు అనుమతించారు.ఉదయం11గంటలకు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.ప్రజావేదిక కూల్చివేతతోపాటు తాజా పరిణామాలపై చర్చించనున్నారు.