ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిట్టింగ్​లకే ఛాన్స్! - చంద్రబాబు

పశ్చిమగోదావరి...తెదేపాకు కలిసొచ్చే జిల్లా...గతేడాది సైకిల్ జోరు మీద సవారీ చేసిన జిల్లా కూడా.. దీంతో తెదేపా అధినేత చంద్రబాబు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ఏలూరు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చారు.

sitting mla's

By

Published : Feb 27, 2019, 4:53 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కిందటి ఎన్నికల జోరు మరోసారి కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏలూరు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ అభ్యర్థులతో అమరావతి ప్రజా వేదికలో సమావేశమయ్యారు. దాదాపు సిట్టింగ్​లకే ప్రాధాన్యమిచ్చారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో కొందరు సిట్టింగులకు మార్పుతప్పదనే సంకేతాలిచ్చారు. కొన్ని సీట్లపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పలువురు సిట్టింగ్​లకు మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తూ కొన్ని సిట్ల నిర్ణయాన్ని పెండింగ్​లో పెట్టారు చంద్రబాబు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సిట్టింగ్​లకే ప్రాధాన్యం కల్పించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతల పూడి, పోలవరంతో పాటు కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఏలూరుకు తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరుకు చింతమానేని ప్రభాకార్, ఉంగుటూరుకు గన్ని వీరాంజనేయులకు తిరిగి అవకాశం కల్పించారు.
పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఉండగా...ఆ స్థానాన్ని బొరగం శ్రీనివాస్ ఆశిస్తున్నారు. చింతలపూడిలో మాజీమంత్రి పీతల సుజాత ఉన్నారు. అదే టికెట్ ను కర్రా రాజారావు, వెంకన్న, నాగరాజు, సొంగా రోషన్ ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్‌ పోటీచేసి గెలిచారు. ఈసారిఈ స్థానానికి జయమంగళవెంకట రమణ, చలమల శెట్టి రామాంజనేయులు, సీఎల్ వెంకటరావుల మధ్య పోటీ నెలకొంది. కృష్ణాలోనే మరోస్థానం నూజివీడు టికెట్‌ కోసం ముదరబోయిన, అట్లూరి రమేష్, దేవినేని అపర్ణ పోటీ పడుతున్నారు.
నరసాపురం నియోజకవర్గ పరిధిలో నరసాపురం, ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న పాలకొల్లు - రామనాయుడు, తణుకు-రాదకృష్ణ, ఉండి- శివరామరాజు, ఆచంట-పితాని సత్యనారయణ, భీమవరం-కులపర్తి రామంజనేయులకు తిరిగి అవకాశం కల్పించారు. నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనాయుడు సీటును కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆశించినా మాదవనాయుడుకే సీఎం అవకాశం కల్పించారు. తాడేపల్లిగుడెం టికెట్ కోసం బాపిరాజు, ఈలి నాని మధ్య పోటీ నెలకొంది. ఇద్దరినీ విడివిడిగా కూర్చోపెట్టి మాట్లాడిన చంద్రబాబు స్పష్టత వచ్చే వరకు నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details