తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభిన్న మతాల ప్రతినిధులుసమావేశమయ్యారు. తాజా రాజకీయాల తీరుపై చంద్రబాబు వారితో మాట్లాడారు. రాష్టంలోమైనారిటీల ఓట్లు తొలగించినాఆశ్చర్యం లేదనిఅనుమానం వ్యక్తం చేశారు.సీబీఐ,ఈడీ,ఐటీ సంస్థలను ప్రధానిమోదీదుర్వినియోగం చేశారని ఆరోపించారు.క్రైస్తవ మతబోధకులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు.దౌర్జన్యాలను ప్రతిఘటించే మీడియాపైనా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ''నా ఇంటికి వచ్చేవాళ్లపైనా నిఘా పెడతారా? ముస్లింలు,ముస్లింలు,క్రిస్టియన్లపై దాడులు చేస్తే ఓట్లు వస్తాయా?ఏం తినాలో,ఏం మాట్లాడాలో వాళ్లేనిర్ణయిస్తారా?'' అని సీఎం వ్యాఖ్యానించారు.కేరళ తుపాను బాధితులకు దుబాయ్ ప్రభుత్వం ఇచ్చిన విరాళాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.ముస్లిం సంస్థలు డబ్బులిస్తే మోదీ అడ్డం పడ్డారన్నారు.బాధితులను ఆదుకునేందుకు మతం ఎందుకని ప్రశ్నించారు.మత విద్వేషంతో ఆర్థికసాయాన్ని అడ్డుకోవడం అమానుషమన్నారు.
మోదీతో కలిసిన జగన్‌కు మైనారిటీలు ఎలా ఓటేస్తారు? - general elections 2019
మోదీ దుర్మార్గాలపై తిరగబడ్డ తొలి నాయకుడిని తానే అన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు. తన ఇంటికి వచ్చిన విభిన్న మతాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు కాపాడుకునేలా అంతా ప్రార్థన చేయాలని కోరారు.
అన్ని వర్గాలునాకు సన్నిహితమైనవే...
మోదీ దుర్మార్గాలపై తిరగబడ్డ తొలి నాయకుడిని తానే అన్నారు. ''మోదీ భజన చేసే జగన్‌కు... క్రిస్టియన్లు మద్దతిస్తారా?భాజపాకు బానిసగా మారిన వైకాపాకు ముస్లింలు ఓటేస్తారా?'' అని సీఎం ప్రశ్నించారు.జగన్ నిన్న కూడా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులతో భేటీ అయ్యారని ఆరోపించారు.లోటస్‌పాండ్‌లో తెరాస,వైకాపా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు కలిశారని చెప్పారు.కుర్చీ కోసం జగన్ అన్ని అడ్డదారులూ తొక్కారనీ...కేసుల మాఫీ కోసం మోదీతో,ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ముస్లింలు,క్రిస్టియన్లు తనకెంతో సన్నిహితంగా ఉంటారని బాబు ఆనందం వ్యక్తం చేశారు.భారత్‌లో వ్యవస్థలను రక్షించుకోవాలని మతబోధకులు ప్రార్థించాలనిసీఎం సూచించారు.