ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 4, 2019, 5:21 PM IST

ETV Bharat / state

నిరుపేద వృద్ధులకు.. పెద్ద కొడుకుగా చంద్రబాబు!

"ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా ఉంటా.. " ఇదీ ఈ మధ్య కాలంలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రతి చోటా చెబుతున్న మాట..! మాట చెప్పడమే కాదు.. అక్షరాలా ఆచరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడ పెద్దలు కనిపించినా.. వారిని ఆత్మీయంగా పలుకరిస్తున్నారు.. వారి గుండెచప్పుడు వింటున్నారు. చంద్రబాబు ప్రచార సభల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పు ఇది... !

పెద్ద కొడుకుగా చంద్రబాబు

పెద్ద కొడుకుగా చంద్రబాబు
ఎన్నికల ప్రచారసభలైనా.. అధికారిక కార్యక్రమాలైనా.. ఎప్పుడైనా సరే చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగిస్తారు కానీ .. ఎమోషనల్ టచ్ ఉండదన్న అభిప్రాయం ఉండేది. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో చాలా మార్పు కనిపిస్తోంది. అనేక ఎన్నికల సభల్లో అది కనిపిస్తోంది ప్రచార సభలు, రోడ్​షోలలో వృద్ధులు కనిపిస్తే చాలు ఆప్యాయంగా పలకరిస్తున్నారు. బాగోగులు తెలుసుకుంటున్నారు. వాళ్లు చెప్పే విషయాలను ఓపిగ్గా వింటున్నారు. పెద్ద కొడుకులా ఉంటా అని చెప్పిన మాటకు సార్థకత తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో ప్రజాదర్బార్ సభలో వేదికపైకి వచ్చిన వృద్ధురాలు పెంటమ్మ ప్రేమను చూసి మురిసిపోయారు. ఆ వృద్ధురాలు మాటలకు పులకించిపోయిన బాబు..ఆ పెద్దావిడకు పాదాభివనందం చేశారు. మళ్లీ తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని వంగి కాళ్లకు మొక్కారు. ఈ సన్నివేశాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోడ్డుషోలో ఓ పెద్దవిడను ప్రేమతో పలకరించారు చంద్రబాబు. ఎండలో వచ్చావు తల్లి అంటూ వాహనంపైకి పిలిపించుకున్నారు. పెన్షన్ వస్తుందా అని అడగ్గా..కొడుకులు కూడా ఇవ్వట్లేరు..మీరు రెండువేలు ఇస్తున్నారని చెప్పిందావిడ. ఆమె మాటలకు పరవశించిపోయిన బాబు..పెద్దకొడుకులా ఉంటానమ్మా అంటూ భరోసా ఇచ్చారు.

అనంతపురం జిల్లా ప్రచారంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో వృద్ధురాలు నర్సమ్మ ఉత్సాహానికి మైమరిచిపోయారు. ఆమెను వేదికపైకి పిలిపించుకున్నారు. బాగోగులు అడిగి తెలు తెలుసుకున్నారు చంద్రబాబు. నీవల్లే నేను బతికున్నా సామీ’ అంటూ చంద్రబాబును నర్సమ్మ కౌగిలించుకుంది. దీంతో సభావేదిక ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లింది. నేనున్నా నీకంటూ అభయమిచ్చిన ముఖ్యమంత్రి ఆమెను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగారు.

అనంతపురం జిల్లాలో అమరావతి నిర్మాణానికి విరాళమిచ్చిన వృద్ధురాలి కాళ్లు మొక్కారు చంద్రబాబు. పెన్షన్ సొమ్ము ఇచ్చిన ఇంకో పెద్దవిడకు సభా వేదికపై కాళ్లకు నమస్కరించారు. కాకినాడలో నవ నిర్మాణ దీక్ష ముగింపు సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రేమగా దగ్గరికి వచ్చి పలకరించిన ఓ వృద్ధురాలిని ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. చంద్రబాబుపై ఆమె పాడిన పాటకు పరవశించిపోయారు. ఇలా పెద్దలను పలకరిస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు చంద్రబాబు.

తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 50లక్షలకు పైగా వృద్ధాప్య ఫించన్లు ఇస్తోంది. ప్రతీ నెలా 2వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతుండటంతో సానుకూలత కనిపిస్తోంది. అది ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిఫలిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details