శాసనసభలో తాను అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబు చెప్పలేక ముఖ్యమంత్రి జగన్ సభ వాయిదా వేసుకొని వెళ్లిపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు.
పీపీఏలపై తాను అడిగిన ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానమే లేదని ఎద్దేవా చేశారు. ఏటా 4 శాతం బొగ్గు ధర పెరగుతుందని... ప్రస్తుతం ఏపీలో ఒకరోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో థర్మల్ విద్యుత్ మొత్తం ఎందుకు కొనలేదని జగన్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తిదారుడుగా ఉన్న జగన్ అక్కడ ఎందుకు ఎక్కువ ధర తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే స్పందించలేదన్నారు. జగన్ అవాస్తవాలు, తప్పుడు లెక్కలతో శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ ఒప్పందాలపై ప్రతి కాగితాన్ని సీఎం జగన్‌కు పంపానని చంద్రబాబు అన్నారు. పవన విద్యుత్ ధర తగ్గించాలని ఎప్పటినుంచో కోరుతున్నాని తెలిపారు.