ఎమ్మెల్సీ ఎన్నికపై తెదేపా భేటీ - godavari districts
ఉపాధ్యాయ ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు ఏడు జిల్లాల తెదేపా నేతలతో సమావేశమయ్యారు
ఉపాధ్యాయ ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు ఏడు జిల్లాల తెదేపా నేతలతో సమావేశమయ్యారు .ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల నేతలు ఈ భేటీ లో పాల్గొన్నారు. పార్టీ తరుపున అభ్యర్ధులను నిలపాలా..., స్వంత్రతులకు మద్దతివ్వాలా.. అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు గుంటూరు జిల్లా నేతలు ఆసక్తి చూపారు. రాయపాటి శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పోతినేని శ్రీనివాస రావు పేర్ల పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. ఎక్కువ మంది ఓటర్లు గుంటూరు జిల్లాలో ఉన్నందున ఆ జిల్లా నేతలకే టిక్కెటు ఇవ్వాలని మెజార్టీ నేతలు అభిప్రాయం పడ్డారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులకు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.