సర్వేలన్నీ తెదేపాకే అనుకూలం: నేతలతో సీఎం - babbu meet with tdp cadere
రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల సర్వేలన్నీ తెదేపాకే అనుకూలంగా ఉన్నాయన్నారు.
![సర్వేలన్నీ తెదేపాకే అనుకూలం: నేతలతో సీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3188622-818-3188622-1556977355489.jpg)
ఎన్నికల అనంతర పరిస్థితులపై పార్టీ నాయకులతో తెదేపా అధినేత చంద్రబాబు సమీక్షించారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. సర్వేలన్నీ తెలుగుదేశానికే సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇది పార్టీకి, రాష్ట్రానికి శుభసంకేతమని అన్నారు. పార్టీలో ఉన్న ఏ స్థాయి నాయకుడైనా ఒక సేవామిత్రగా ఉండాలని... వంద ఓట్లను ప్రభావితం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కుప్పంతో పోటీపడాలని, కుప్పం నమూనాను చేపట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిక్యత నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకోసారి అన్ని నియోజకవర్గాలను స్వయంగా పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టామని, కొత్త రాష్ట్రంలో వ్యవస్థల నిర్మాణానికే అత్యధిక సమయం పట్టిందని చెప్పారు. అందుకే పార్టీకి కేటాయించే సమయం తగ్గిందని, ఇకపై పార్టీకే పూర్తి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ప్రతి రోజు రెండు మూడు గంటలు పార్టీకే కేటాయిస్తాని, పోలింగ్ కేంద్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేయటమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.