ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోవాలా చల్లని ఐడియా.. నెటిజన్లు ఫిదా

ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్ వంటి వాటిని ఆశ్రయిస్తాం. ఓ డ్రైవర్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా తన ఆటోపైనే మొక్కలు పెంచేసి.. సోషల్ మీడియాలో వైరల్​గా మారాడు.

By

Published : Jun 20, 2019, 4:10 PM IST

ఆటోవాలా

తన ప్రయాణికులకు చల్లదనం పంచేందుకు ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఆటో టాప్​ను నర్సరీలా మార్చేశాడు. పర్యావరణానికి మేలు చేకూరుస్తూనే చల్లదనాన్ని పొందవచ్చు అనే అతని ఐడియాకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఇతని ఆటో ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చూడటానికి "నేనాటోవాడ్ని.. ఆటోవాడ్ని.. అన్నగారి రూటు వాడ్ని'' అంటూ బాషాలో రజనీకాంత్‌లా కనిపిస్తున్నప్పటికీ.. ఇతను మాత్రం మన తెలుగువాడేనని అనటంలో సందేహం లేదు. ఫోటో ఏ ఊరిలోదో తెలియకపోయినా అతని ఆలోచన మాత్రం అబ్బురపరుస్తోంది. సృజనాత్మకతతో పని చేయటానికి గొప్ప గొప్ప చదువులే అక్కర్లేదు. సాధారణ ప్రజల్లోనూ, చిన్నచిన్న వృత్తుల్లోనూ కూడా కళాత్మకంగా, సృజనశీలతతో సేవలు అందించవచ్చని ఈ ఆటోవాలా నిరూపించాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details