ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరకు రవాణా నిర్వహణకు.. ఆర్టీసీ కొత్త టెండర్లు - undefined

ఆర్టీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సరకు రవాణా ప్రాజెక్టుకు అవాంతరాలు ఏర్పాడ్డాయి. ప్రజల ఆదరణతో 2018-19ఆర్థిక సంవత్సరంలో 120 కోట్ల ఆదాయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్జించింది. మూడేళ్ల పాటు సేవలు అందించేలా టెండర్లు దక్కించుకున్న గెలాక్సీ అనే సంస్థ చేతులెత్తిసేంది. రంగంలోకి యాజమాన్యం కొత్త టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధమైంది. వివరాలు తెలుసుకునేందుకు www.mstcecommerce.com వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చింది.

సరకు రవాణా నిర్వహణకు ఆర్టీసీ కొత్త టెండర్లు

By

Published : May 11, 2019, 10:02 AM IST

సరకు రవాణా నిర్వహణకు ఆర్టీసీ కొత్త టెండర్లు
సరకు రవాణా... రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి విజయవంతంగా నడుపుతోన్న ప్రాజెక్టు. ఆర్టీసీకి కాసుల పంట పండిస్తోన్న ఈ ప్రాజెక్టు నిర్వహణలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 3 ఏళ్ల పాటు నిర్వహణ కోసం టెండర్ దక్కించుకున్న నిర్వహణ సంస్థ అర్దాంతరంగా చేతులెత్తేసింది. రంగంలోకి దిగిన ఆర్టీసీ యాజామాన్యం మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టి నిర్వహణపరంగా ఇబ్బందులు తలెత్తుకుండా చర్యలు చేపట్టింది.

ఆర్థిక కారణాలతో తప్పుకున్న గెలాక్సీ..
నష్టాలను పూడ్చుకోవటమే లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ 2017 ఆగస్టు 27న సరకు రవాణా ప్రాజెక్టు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల ద్వారా సొంతంగా సరకు రవాణా చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అప్పట్లో గెలాక్సీ అనే సంస్థ మూడేళ్ల నిర్వహణకు తక్కువ ధరకే టెండర్లు దక్కించుకుంది. 2017 సెప్టెంబర్ 1 నుంచి నిర్వహణ బాధ్యత తీసుకుంది. ఆర్థిక కారణాలు చూపిస్తూ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఒప్పందం రద్దుకు యత్నిస్తోంది.

కొత్త టెండర్లకు సిద్ధం..
గెలాక్సీ సంస్థ నిర్వాకంతో అవాంతరాలొచ్చాయి. నూతన ఏజెన్సీ నియామకానికి ఆర్టీసీ వెంటనే చర్యలు చేపట్టింది. నూతన ఏజెన్సీ కోసం జోన్ల వారీగా టెండర్లు పిలిచింది. మే 3న విజయవాడలో ఓ అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారే టెండర్లు వేయాలని స్పష్టం చేసింది. వివరాలు కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. నిర్ణీత కాలం వరకు బాధ్యతలు నిర్వహించకుంటే చర్యలు తీసుకునే అంశాన్ని చేర్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details