14 మండలాల్లో తుపాను ప్రభావం.
ఫొని తుపాను ప్రభావంతో కవిటి, మందస, ఇచ్ఛాపురంలో ఈదురు గాలులు, వర్షాలు పడ్డాయని... మొత్తం 14 మండలాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. ఆయా మండలాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయడంతో పాటు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. తుపాను ప్రాంతాల్లో పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇచ్ఛాపురంలో 20సెం.మీ.వర్షపాతం నమోదు అయ్యిందని చంద్రబాబు తెలిపారు.
తుపాను ప్రభావంతో.. రూ.10 కోట్లు నష్టం - cm
ఫొని తుపాను విషయంలో ఆర్టీజీఎస్ అంచనాలు నిజమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు సమాచారమిచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలో సుమారు రూ.10 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు
తుపాను ప్రభావంతో.. రూ. 10 కోట్ల నష్టం
ఫొని తుపాను ప్రబావం వల్ల రాష్ట్రంలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు 182 సెల్ఫోన్ టవర్లు పునరుద్ధరించడంతోపాటు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించామని తెలిపారు. లక్షా 14వేల మందికి భోజన వసతి కల్పించామని వివరించారు. ఈ సారి సమాచార పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.
Last Updated : May 3, 2019, 8:29 PM IST