సీఎం జగన్ మాట తప్పరు.. హామీలు తీరుస్తారు! - cm jagan
కొత్త ముఖ్యమంత్రి, తమ నాయకుడు వైఎస్ జగన్పై.. వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పారు.
ycp leaders
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్... సుపరిపాలన అందిస్తారని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని జగన్ నెరవేర్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నవరత్నాల హామీలు అమలు చేస్తారని.. పారదర్శకత తో కూడిన పాలను అందిస్తారని చెప్పారు.