ఈ నెల 14న జరగాల్సిన మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆ వివరాలను ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లనున్నాయి. ఈ అంశాలను ఎన్నికల సంఘం ఆమోదిస్తేనే... కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తాయి.
ఎన్నికల సంఘానికి... మంత్రివర్గ సమావేశ అజెండా! - cabinet meeting
ఈ నెల 14న జరగాల్సిన మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది.
నాలుగు అంశాలపై స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. రాష్ట్రంలో ఫోని తుఫాన్ ప్రభావం నష్టం, తాగునీటి ఎద్దడి, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీల ఇబ్బందులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు తో సీఎస్ నేతృత్వంలోని బృందం చర్చించి తదుపరి ఆమోదం కోసం ఈసీకి పంపారు. అజెండాలోని అంశాలపై ఈసీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదం తెలిపితే మంత్రిమండలి సమావేశ నిర్వహణకు ఆటంకాలు తొలగినట్టేని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కారణంగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తప్పనిసరైంది.