ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ సీఎం జగన్​కు ప్రముఖుల శుభాకాంక్షలు - oath

నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాహుల్ గాంధీ సహా ప్రముఖులు యువ నేతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జగన్

By

Published : May 30, 2019, 3:20 PM IST

Updated : May 30, 2019, 5:00 PM IST


నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్​కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్​కు ఫోన్ చేసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ట్విటర్​లోనూ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్​కు ప్రముఖుల శుభాకాంక్షలు

రాహుల్ అభినందనలు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్​కు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డికి నా అభినందనలు. కొత్త మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు' అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రజల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను" అని ట్విటర్ ద్వారా జగన్​కు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.

అరుణ్ జైట్లీ ట్వీట్
రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ట్విటర్​లో శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్​కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

రాజస్థాన్ సీఎం శుభాకాంక్షలు
రాజస్థాన్ ముఖ్యంత్రి అశోక్ గెహ్లోట్... రాష్ట్ర యువ ముఖ్యమంత్రికి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : May 30, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details