ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శాసనసభ వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరిస్తా' - తమ్మినేని సీతారాం

సభాపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాంకు అభినందనల వెళ్లువెత్తాయి. ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు, ఆముదాలవలస సహా... పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు సీతారాంను కలసి అభినందనలు తెలిపారు.

తమ్మనేని సీతారాం

By

Published : Jun 13, 2019, 10:00 PM IST

సభాపతిగా ఉన్న తాను కచ్చితంగా శాసనసభ వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరిస్తానని తమ్మనేని సీతారాం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పతనమైపోతున్న విలువలను సభ నిలబెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సభ్యులందరు సహకరించాలని సూచించారు.

తమ్మనేని సీతారాం

ABOUT THE AUTHOR

...view details