ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్లలో చైతన్యం... 80 శాతానికి పైగా పోలింగ్!! - ap elections 2019

ఈవీఎంలు మొరాయించినా, సౌకర్యాలు లేకున్నా.. అర్థరాత్రి వరకు క్యూలో నిలబడాల్సి వచ్చినా... విసుగు చెందకుండా ఓపికతో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్ర ప్రజలు. ఓటర్లలో వచ్చిన అనూహ్యమైన చైతన్యాన్ని చూసి రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతాన్ని మించి నమోదైన పోలింగ్ తమకే లాభిస్తుందని ఎవరికివారే ధీమాగా ఉన్నారు.

ఓటర్లలో చైతన్యం... 80 శాతానికి పైగా పోలింగ్

By

Published : Apr 12, 2019, 6:22 PM IST

ఓటర్లలో చైతన్యం... 80 శాతానికి పైగా పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​ ఓటర్లు ప్రజాస్వామ‌్య స్ఫూర్తి కనబరిచారు. ఉదయాన్నే ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన వారు ఈవీఎంల మొరాయింపుతో ఇబ్బంది పడ్డారు. ఎన్నికల సంఘం విఫలం స్పష్టంగా కనిపించింది. మాక్ పోలింగ్​లో పనిచేసిన ఈవీఎం, వీవీప్యాట్​లు... ఓటింగ్​లో మాత్రం చాలా ప్రాంతాల్లో ఇబ్బందికి గురి చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అన్ని అడ్డంకులను దాటుకొని, చీకటిని కూడా లెక్కచేయకుండా వృద్ధులు, మహిళలు పెద్దసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్, బెంగళూరు, వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సొంత గ్రామాలకు చేరుకున్నారు. కొంతమంది ఓట్లు గల్లంతై నిరాశగా వెనుదిరిగారు. మొత్తంగా గతం కంటే పోలింగ్ పెరిగి దాదాపు 80శాతానికి పైగా నమోదైంది.

ఈవీఎంల మొరాయింపుతో ఉదయం 8 గంటల వరకు కేవలం 9 శాతం ఓటింగ్ నమోదైంది. క్రమక్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంటకు 40.53 శాతానికి చేరుకుంది. నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సాయంత్రం ఆరు గంటలకు 70 శాతం పోలైంది. గేటు లోపల ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించినందున అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.

ఎన్నికల సంఘం తీరుపై ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని ఆరోపించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు, సిబ్బందికి కనీస శిక్షణ ఇవ్వకపోవడం ఈసీ వైఫల్యమని విమర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవటం ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తడానికి కారణాలయ్యాయి.

ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తినా... అది పోలింగ్ శాతంపై ప్రభావం చూపలేదు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటర్లలో వచ్చిన చైతన్యం... తమకే అనుకూలమంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి.

వైకాపా నేత చెవిరెడ్డిపై పోలీసులకు నాని ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details