గ్రామ వాలంటీర్ల నియామకం కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు 13 జిల్లాల కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. 11,077 పంచాయతీల్లో 1, 84,498 మంది వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సగటున ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం నియామకాలు చేపట్టనుంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1072 పంచాయతీల్లో 21 వేల 600 వాలంటీర్లను నియమించనున్నారు.
జిల్లాలవారీగా.. వాలంటీర్ల నోటిఫికేషన్లు వచ్చేశాయ్ - ap govt issue notification for volunteers
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్ల నియామకాలకు జిల్లా కలెక్టర్లు ఆదివారం ప్రకటనలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 21,600 మంది వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అవసరాలను బట్టి వాలంటీర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.
ap govt issue notification for volunteers
జిల్లాల వారీగా వాలంటీర్ల వివరాలు:
- పశ్చిమగోదావరి జిల్లా - 17,881
- శ్రీకాకుళం - 11,924
- విజయనగరం - 10,012
- విశాఖ జిల్లా – 12, 272
- గుంటూరు - 17, 550
- కృష్ణా - 14, 000
- అనంతపురం - 14, 007
- చిత్తూరు - 15, 824
- కర్నూలు - 12, 045
- కడప - 9, 322
- నెల్లూరు - 10,000
- ప్రకాశం -14,106
జూన్ 24 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అభ్యర్థులు http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి శిక్షణానంతరం ఆగస్టు 15 నుంచి బాధ్యతలు అప్పగించనున్నారు.
Last Updated : Jul 26, 2019, 9:22 AM IST