శ్రీలంక బాంబుపేలుళ్లలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం భరోసా చర్యలను చేపట్టింది. పేలుళ్లలో చిక్కుకుని పాస్ పోర్టులు, వీసాలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులు శ్రీలంకలోని భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. ఎంబసీలో ఎకనామిక్, కమర్షియల్ వింగ్ కార్యదర్శి నేహాను సంప్రదించాలని సీఎస్ సుబ్రహ్మణ్యం కోరారు. +947779 02082 నెంబరు ద్వారా సంప్రదించవచ్చని వివరాలు వెల్లడించారు.
పేలుళ్ల బాధితులు.. భారత ఎంబసీని సంప్రదించాలి: సీఎస్ - srilanka attacks
శ్రీలంక బాంబు పేలుళ్లలో గాయపడిన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భరోసా చర్యలను చేపట్టింది. పాస్‌పోర్టు, వీసాల కోసం భారత ఎంబసీని సంప్రదించాలని బాధితులకు సీఎస్ సూచించారు.
భారత ఎంబసీని సంప్రదించాలి:సీఎస్
అనంతపురం నుంచి కొలంబో వెళ్లిన పలువురు తమ పాస్‌పోర్టులు, వీసాలు హోటల్ గదిలో మర్చిపోయారని సమాచారం వచ్చిందని... వారు వెంటనే నేహాను సంప్రదిస్తే సాయం అందుతుందని సీఎస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
.