కాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. పాలిసెట్‌కు 348 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా 31వేల 646 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
10 గంటలకు ఈసెట్
ఇవాళ ఏపీ ఈసెట్-2019 పరీక్ష కూడా జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని పలు పట్టణాలతోపాటు హైదరాబాద్‌లోని 4 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 39వేల 734 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న కన్వీనర్ భానుమూర్తి... నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు.
కాసేపట్లో పాలిసెట్, ఈసెట్ పరీక్షలు - పాలిసెట్
రాష్ట్రంలో నేడు పాలిసెట్, ఏపీ ఈసెట్-2019 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ఏపీ ఈసెట్... 11 గంటలకు పాలిసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
కాసేపట్లో పాలిసెట్, ఈసెట్ పరీక్షలు
ఇదీ చదవండి...