తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. తమను సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాల్లో నియమించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 13 జల్లాల్లో ఉన్న 4వేల657మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. పదేళ్లుగా పోరాడుతున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసేందుకు సీఎం జగన్ అనుమతి ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి..డీఎస్సీ-2008 అభ్యర్థులు - dsc students andolana
తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ డీఎస్సీ-2008 అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మా సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి..డీఎస్సీ-2008 అభ్యర్థులు
మరోవైపు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని గోపాలమిత్రలు మూడురోజులుగా సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా.. ఉద్యోగభద్రత లేదని గోపాల మిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో తమను నియమించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు. సీఎం ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ప్లకార్డుల ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
Last Updated : Jul 7, 2019, 9:46 AM IST