రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న ఆయన... కౌంటింగ్ ముగిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పలువురు అనుమానితులు, రౌడీషీటర్లను బైండోవర్ చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 12వందల బాడీ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తామని డీజీపీ తెలిపారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: డీజీపీ - ap elections
ఈనెల 23న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. అనుమతి లేకుండా విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు.
డీజీపీ ఆర్పీ ఠాకూర్