ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ సబబే..: ద్వివేది

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించే ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై ఈసీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. పోలింగ్ సమయంలో తప్పు జరిగినందువల్లే ఈసీ స్పందించి రీపోలింగ్​కు ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు.

ఎవరినో కాపాడాలని ఈసీ భావించడం లేదు:ద్వివేది

By

Published : May 18, 2019, 10:09 AM IST

ఆలస్యమైనా... జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకే రీపోలింగ్ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులతో సహా ఇతరుల పైనా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగిన రోజు పోలింగ్ కేంద్రంలో అనధికార వ్యక్తులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని వెల్లడించారు. ఎవరినో కాపాడాలనో ఈసీ భావించడం లేదన్నారు.

సీసీ టీవీ దృశ్యాలు పరిలీంచే..

ప్రతీ రిటర్నింగ్ అధికారి 33 నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు పంపే 17వ నివేదిక, సాయంత్రం 20, 21, 23 నివేదికలు చాలా కీలకమన్నారు. అన్ని నివేదికలూ అంతా బాగుందనే వచ్చాయని స్పష్టం చేశారు. అయితే తర్వాత వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కోర్టుకు వివరిస్తాం..

ఎన్నికల సిబ్బంది కుమ్మక్కైతే ఈసీ చూస్తూ ఉరుకోదని ద్వివేది అన్నారు. చంద్రగిరిలో ఏం జరిగిందన్న విషయాన్ని అవసరమైతే కోర్టుకూ వివరిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కోరిన ఏడు నియోజకవర్గాల్లోని 18 చోట్ల కూడా సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందులో కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు 19 తేదీన రీపోలింగ్ నిర్వహించాల్సిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. చిత్తూరు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 250 మంది పోలీసులతో భద్రత కల్పించాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు.

పరిశీలనకు 200 మంది...

ఫలితాల లెక్కింపు పరిశీలనకు రాష్ట్రానికి 200 మంది కేంద్ర పరిశీలకులు రానున్నట్లు ద్వివేది తెలిపారు. 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు , 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరి చొప్పున పరీశీలకులు ఉంటారని వెల్లడించారు.

ఇదీ చూడండీ:చంద్రగిరి రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం

ABOUT THE AUTHOR

...view details