ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేపు మంత్రివర్గ భేటీ... కీలక నిర్ణయాలపై చర్చ'

రేపు రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. నూతన మంత్రివర్గం 8 కీలక అంశాలపై చర్చించనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రధానంగా చర్చించనుంది. పింఛన్ల పెంపు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

మంత్రివర్గ భేటీ

By

Published : Jun 9, 2019, 8:36 AM IST

నష్టాల్లో ఊబిలో చిక్కుకున్న ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. సోమవారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీనితోపాటు మరో 7 అంశాలను ఎజెండాలో పొందుపర్చారు. పింఛను మొత్తాన్ని రూ.2,250 చేయడంతోపాటు ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ప్రకటించారు. రేపు జరిగే భేటీలో దీనికి ఆమోద ముద్ర వేయనున్నారు.

మంత్రివర్గ భేటీ

చర్చించే అంశాలు...
1.కంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు
2.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం
3.పింఛనును రూ.2,250 చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించడం
4.ఆశా కార్యకర్తల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం
5.ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటన
6.అక్టోబరు నుంచి ‘రైతు భరోసా’ కింద రూ.12,500 ఇచ్చే పథకానికి ఆమోదం
7.హోంగార్డుల వేతనాల పెంపు
8.పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు

ABOUT THE AUTHOR

...view details