అన్నదాతసుఖీభవ పథకం రెండో విడత నగదును ప్రభుత్వంవిడుదల చేసింది.మొత్తం 44 లక్షల 99 వేల 843 ఖాతాలకు నగదును అధికారులు బదిలీ చేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక వేయి349 కోట్ల రూపాయలనుజమచేశారు.ఒక్కో లబ్ధిదారునికి రూ.3 వేలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేశారు.మొదటి విడతగా వెయ్యి రూపాయలను ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. తాజాగా రెండో విడత నగదును విడుదల చేసింది. లబ్ధిదారుల కుటుంబాలు ఈ చర్యతో ఆనందిస్తున్నాయి. ప్రభుత్వ చర్యను స్వాగతించాయి.
అన్నదాత - సుఖీభవ: రెండో విడత నగదు విడుదల - రెండో విడత నిధులు విడుదల
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదును ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 44 లక్షల 99 వేల 843 ఖాతాలకు నగదును అధికారులు బదిలీ చేశారు.
రెండో విడత నగదు విడుదల
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
అన్నదాత సుఖీభవ పథకం నిధులను అనుకున్న సమయానికే లబ్ధిదారులకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతూనే ఉన్నారు. ఎన్నికల కోడ్‌తో ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రచార సభల్లోనూ ఈ విషయాన్ని వివరించారు. ఎన్నికలకూ, ఈ నిధుల విడుదలకూ ఏ మాత్రం సంబంధం లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మాట నిలబెట్టుకుంటూ.. ఏకంగా 1349 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు.