గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు అంచనాలు పెంచి అయినవారికి కట్టబెట్టారని ఆరోపించారు . పోలవరానికి సంబంధించి ఓ పని కోసం.. 5 కోట్ల పనుల కోసం 137కోట్లు కేటాయించారన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో అవినీతిని బయటకు తీస్తామని మంత్రి అన్నారు.
ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌తో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. కోల్ ఇండియాలోనే ఈ విధానం ఉందని.. తమ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్‌ను తీసుకొచ్చామన్నారు. దీని కోసం జడ్జిని నియమించి... ప్రాజెక్ట్, టెండర్ ఏడు రోజులు పబ్లిక్ డొమైన్‌లో పెడతామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. దేశ చరిత్రలోనే జ్యుడీషియల్ కమిషన్ తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అన్నారు. సభ్యులు అడిగినట్లుగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.